ఆచంట మే 21 :ఇటీవల మే 13న జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ కు సంబంధించి జూన్ 4న జరిగే కౌంటింగ్ ప్రక్రియ చట్టపరమైన నిబంధనలు కచ్చితంగా పాటిస్తామని స్థానిక రిటర్నింగ్ ఎన్నికల అధికారి వి స్వామి నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. ఆయన కార్యాలయంలో స్టాండింగ్ కమిటీ ఏర్పాటు చేసి ఓట్ల లెక్కింపు విధివిధానాలు సభ్యులకు వివరించారు. అసెంబ్లీ మరియు పార్లమెంట్ కు సంబంధించి కు సంబంధించి 14 టేబుల్స్ ఉంటాయని అంతేగాక పోస్టల్ బ్యాలెట్స్ కు సంబంధించి కౌంటింగ్ హాల్లో నాలుగు టేబుల్స్ ఉంటాయని తెలిపారు. ఫారం 18 ద్వారా దరఖాస్తు చేసుకున్న ఏజెంట్లు వారికి కేటాయించిన టేబుల్స్ నందు మాత్రమే విధి నిర్వహణలో ఉండాలని స్పష్టం చేశారు. ముందుగా ఓట్ల లెక్కింపు పోస్టల్ బ్యాలెట్ తో మొదలు పెడతారని తెలిపారు. అనుమతి ఉన్న 18 మంది ఏజెంట్లు
ఉదయం 7 గంటల లోపు విధిగా హాజరు కావాలని తెలిపారు. మొబైల్ ఫోన్లకు అనుమతి లేదన్నారు. ఆచంట నియోజకవర్గం ఫలితాలు 14 రౌండ్లలో వెల్లడిస్తామని ఒక్కో రౌండ్ లో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయని వివరాలు ఓట్ల లెక్కింపు కేంద్రంలో ఏర్పాటు చేసిన బోర్డుపై సిబ్బంది లిఖిస్తారని ఈ ప్రక్రియ మొత్తం వీడియో తీసి భద్రపరుస్తామని అంతేకాక సీసీటీవీ కెమెరాల నిఘా లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందని ఆర్ ఓ స్వామి నాయుడు తెలిపారు. ఈ సమావేశంలో ఎలక్షన్ ఏజెంట్ ఎన్ వినోద్ కుమార్ శర్మ (టిడిపి) ఎలక్షన్ ఏజెంట్ వీ నవీన్ (బి ఎస్ పి) అభ్యర్థి నెక్కంటి వెంకట సత్యనారాయణ (సతీష్) (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అభ్యర్థి వెలగల శ్రీనివాస్ రెడ్డి (జై భారత్) ఇండిపెండెంట్ అభ్యర్థి రామోజీ పూర్ణచంద్ర శేఖర్ ఇండిపెండెంట్ అభ్యర్థి చికిలే రతన్ రాజు పెనుగొండ తహసిల్దార్ ఆర్ వి వి రోహిణి దేవి పెనుమంట్ర తహసిల్దార్ లక్ష్మీ కళ్యాణి ఆచంట ఎంపీడీవో పీ నరసింహ ప్రసాద్ పెనుగొండ ఎంపీడీవో ఎస్ శ్రీనివాస దొర పెనుమంట్ర ఎంపీడీవో పి పద్మజ ఎలక్షన్ డ్యూటీ ఎం ప్రసాద్ రాజు తదితరులు హాజరయ్యారు.