శ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల ఐపీఎస్, తాడేపల్లిగూడెం డిఎస్పి డి.ఎస్.ఆర్.వి.ఎస్.ఎన్ మూర్తి ఆదేశాల మేరకు తాడేపల్లిగూడెం పట్టణ సీఐ సుబ్రమణ్యం ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెం మిలటరీ కాలనీలో సమస్తాత్మక ప్రదేశాల్లో తనిఖీలు నిర్వహించి, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం పట్టణ సీఐ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం పట్టణంలో శాంతిభద్రలకు పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు ఈ తనిఖీలు చేస్తూ, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తాడేపల్లిగూడెంలో ఎవరైనా ఈసీ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం టౌన్ ఎస్సైలు జే.వీ.ఎన్ ప్రసాద్, కె. సుధాకర్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.
