ప్రయాణికులు సులభంగా, కచ్చితంగా రైలు టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు జియో రైల్ యాప్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. జియో రైల్ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా జియో యూజర్లు అయ్యి ఉండాలి. ఇతర నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్న వారు ఈ సేవలను పొందలేరు. రైలు టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్ స్టేటస్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు.
ప్రముఖ టెలికం సంస్థ రిలయన్స్ జియో యూజర్లకు ఎన్నో రకాల సేవలు అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఫైనాన్స్ మొదలు ఎంటర్‌టైన్‌మెంట్ వరకు అన్ని రకాల సేవలను అందిస్తోంది. ఈ క్రమంలోనే జియో రైల్ యాప్ పేరుతో రైల్వే టికెట్ రిజర్వేషన్ సర్వీస్‌ను కూడా అందిస్తోన్న విషయం తెలిసిందే. జియో రైల్ యాప్ పేరుతో 2019 నుంచి సేవలను ప్రారంభించారు. ఇంతకీ జియో రైల్ యాప్ ప్రత్యేకతలు ఏంటి.? ఇందులో టికెట్స్‌ను ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రయాణికులు సులభంగా, కచ్చితంగా రైలు టికెట్లను బుక్ చేసుకునే వెసులుబాటు జియో రైల్ యాప్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. జియో రైల్ యాప్‌ను ఉపయోగించుకోవాలంటే కచ్చితంగా జియో యూజర్లు అయ్యి ఉండాలి. ఇతర నెట్‌వర్క్‌లను ఉపయోగిస్తున్న వారు ఈ సేవలను పొందలేరు. రైలు టికెట్ బుకింగ్‌తో పాటు పీఎన్‌ఆర్ స్టేటస్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. ఐఆర్‌సీటీసీ భాగస్వామ్యంతో జియో ఈ సేవలు అందిస్తోంది. ఈ యాప్ సహాయంతో యూజర్లు యూపీఐ పేమెంట్స్, జియో మనీతో పాటు అన్ని రకాల బ్యాంకులకు చెందిన క్రెడిట్, డెబిట్ కార్డులతో బుక్ చేసుకోవచ్చు. జియో రైల్ యాప్ ఇంగ్లిష్‌తో పాటు హిందీలోనూ అందుబాటులో ఉంది. ఈ యాప్‌లో మీరు అంతకు ముందు ప్రయాణించి ట్రావెల్ హిస్టరీతో పాటు, రైల్వే స్టేషన్స్, రైలు ఛార్జీల వివరాలను తెలుసుకోవచ్చు.
టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి..
* ఇందుకోసం ముందుగా జియో రైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అనంతరం మీ జియో ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో కన్ఫార్మ్ చేసుకోవాలి.
* తర్వాత కొన్ని వివరాలు అందజేయడం ద్వారా మీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పూర్తవుతుంది. అంనతరం మీరు ఎక్కడ రైలు ఎక్కాలనుకుంటున్నారు.? ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారు.? అనే వివరాలు అందించాలి.
*అనంతరం మీరు ప్రయాణం చేయాలనుకుంటున్న తేదీని సెలక్ట్ చేసుకోవాలి. ఇక సీట్లను బుక్ చేసుకొని, చివరిగా పేమెంట్ చేస్తే సరిపోతుంది. మీ టికెట్స్ కన్ఫార్మ్ అవుతాయి.