భీమవరం మే 18 : ప్రతి ముద్దాయి తన నేరవృత్తిని మానుకుని సమాజంలో సామాన్యమైన జీవితం జీవించాలని భీమవరం ప్రిన్సిపల్ జడ్జ్
జి.సురేష్ బాబు ముద్దాయిలకు సూచించారు. శనివారం ఆయన భీమవరం సబ్ జైల్ ని సందర్శించి ముద్దాయిల నేరచరిత్ర అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ముద్దాయిలు తన తరఫున వాదించ న్యాయవాదిని పెట్టుకునే ఆర్థిక స్థోమత లేని ముద్దాయిలకు సంస్థ తరఫున ఉచిత న్యాయవాదిని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతీ శనివారం ఉచిత న్యాయవాది, వాలంటీర్లు జైలును సందర్శిస్తారని,వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో న్యాయమూర్తితో పాటు ఉచిత న్యాయవాదులు బేతపూడి లోకేశ్వరరావు, ఎం బి .భవాని, పారా లీగల్ వాలంటీర్ కె . కామేశ్వరి, జైలు సూపరింటెండెంట్ వెంకటగిరి తదితరులు పాల్గొన్నారు.