నర్సాపురం కమిషనర్ శభాష్ – ఆర్ డి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ
నర్సాపురం మే 17: రాజమండ్రి రీజినల్ డైరెక్టర్,మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సాధారణ తనిఖీ లో భాగంగా శుక్రవారం నరసాపురం మున్సిపాలిటీ ని సందర్శించి, ఉద్యోగుల తో, సచివాలయం కార్యదర్శులు తో సమావేశం నిర్వహించి, తగిన సూచనలు చేసారు. అనంతరం మునిసిపల్ కమీషనర్ పనితీరు, సచివాలయం ఉద్యోగుల పనితీరు ను ప్రశంసించారు. ప్రజల అవసరాలు తీరుస్తూ సత్వర సేవలు అందించాలని సూచించారు . ఈ నెల 31 న పదవి విరమణ చేయబోతున్న
రీజినల్ డైరెక్టర్,మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ సత్యనారాయణ ను కమీషనర్, మునిసిపల్ ఉద్యోగులు, సచివాలయం ఉద్యోగులు పూలమాల, శాలువాలతో సన్మానం చేయటం జరిగింది.కమీషనర్ డాక్టర్ కోడూరు వెంకటేశ్వర రావు, ఆర్ ఐ నానాజీ, డిఇ రమేష్ బాబు, టి పి ఓ శేషగిరి, ఎస్ ఐ ప్రభాకర్, మేనేజర్ పాల్గొన్నారు