జ్యోతిష్యం ప్రకారం శని శక్తివంతమైన గ్రహం. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ప్రసాదిస్తుంటాడు. అందరూ అయ్యో.. శని అంటారుకానీ.. శని దేవుడు జీవిత పాఠాన్ని నేర్పుతాడు. ఆయన ఇచ్చే అనుభవాలు భవిష్యత్తులో మన పనితీరును సరిదిద్దుకోవడానికి ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు శని తిరోగమనం చేస్తుంటాడు. జూన్ 29న కుంభరాశిలో ఇలాగే తిరోగమనం చేస్తున్నాడు. దీనివల్ల ప్రధానంగా మూడు రాశులవారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతున్నాయి. వాటి వివరాలనుతెలుసుకుందాం.
కుంభ రాశి:
శని తిరోగమనం వల్ల ఈ రాశివారికి పనుల్లో వస్తున్న అడ్డంకులు తొలగిపోతాయి. జీవితంలో మంచి పురోగతి సాధిస్తారు. ఆదాయం రెట్టింపు అవుతుంది. వ్యాపారంలో ఎదురవుతున్న సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా గడుస్తుంది. ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి.