ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ను కలిసిన నాయకులు
రాజోలు మే 15 : జనసేన,తెలుగుదేశం,బిజెపి పార్టీలు బరపలిచిన రాజోలు ఎమ్మెల్యే అభ్యర్థి దేవ వరప్రసాద్ ను పలువురు నాయకులు కలిశారు. మలికిపురం మండలం మలికిపురం ఎల్ ఎస్ ల్యాండ్ మార్క్ నందు బుధవారం దేవ వరప్రసాద్ ని మర్యాదపూర్వకంగా కలిసి సాలువాతో సత్కరించారు.అంతర్వేది దేవస్థానం తెలుగుదేశం నాయకులు మందపాటి వెంకటేశ్వరరావు,మాజీ ఎంపీటీసీ మన్యం శ్రీను,ఎస్సీ నాయకులు తాడి నీలకంఠం,నల్లి రాజు తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి తాడి మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తాడి మోహన్ బాబు మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గం లో వరప్రసాద్ గెలుపు కోసం ఉమ్మడి పార్టీలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు అలుపెరగని ప్రచారం చేశారని తెలిపారు.