బండారు కు బొమ్మిడి నాయకర్ ఆత్మీయ కృతజ్ఞతలు
నరసాపురం మే 14 : సోమవారం సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగియడంతో నర్సాపురం నియోజకవర్గం బొమ్మిడి నాయకర్ మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ నాయకుడు బండారు మాధవ నాయుడుతో మంగళవారం భేటీ అయ్యారు. ఈ ఆత్మీయ కలయికలో ఎన్నికల ప్రచారంలో తనకు అండగా నిలబడిన బండారు కు బొమ్మిడి నాయకర్ కృతజ్ఞతలు తెలిపారు. తెలుగుదేశం అధిష్ఠానం పొత్తులో భాగంగా బండారు మాధవనాయుడు చేసిన ప్రచారం మరియు ఓటింగ్ సరళి పెంచేందుకు కృషి చేసిన క్రమంలో తనకు ఎంతో సానుకూలతను తెచ్చి పెట్టిందని ఈ సందర్భంగా బొమ్మిడి నాయకర్ అన్నారు. సోమవారం జరిగిన పోలింగ్ లో అధిక శాతం ప్రజలు ఓటు వేసేందుకు మొగ్గు చూపినట్లు బండారు మాధవనాయుడు ఈ సందర్భంగా తెలిపారు. ఇద్దరి మధ్య పోలింగ్ సరళి కి సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. బొమ్మిడి నాయకర్ వెంట ఆయన సోదరుడు బొమ్మిడి సునీల్ వున్నారు. బండారు కార్యాలయంలో ఆయన అనుచరులు రేవు ప్రభుదాస్ రెడ్డెం శ్రీను, బుల్లెట్ శ్రీను, కొట్టు పండు, పులపర్తి శ్రీధర్, కొండేటి శ్రీనివాస్, వాతాడి కృష్ణ మరియు సరిపల్లి నాయకులు తదితర తెలుగుదేశం నాయకులు ఉన్నారు.