కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాధారాజు
ఆచంట మే 14 : పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో పోడూరు మండలం తూర్పు పాలెం క్యాంప్ కార్యాలయంలో ఆచంట నియోజకవర్గం కార్యకర్తలతో ఎమ్మెల్యే అభ్యర్థి చెరుకువాడ శ్రీరంగనాథరాజు
ఆత్మీయ సమావేశం మంగళవారం జరిగింది. సోమవారం జరిగిన
స్థానిక ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నాం
అని శ్రీరంగనాధ్ రాజు ధీమా వ్యక్తంచేశారు.నియోజవర్గంలో ఎస్సి, బిసి ఓసి అన్ని సామాజిక వర్గం ప్రజా ప్రతినిధులు ,అభిమానులు ప్రస్తుత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది అని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి
కార్యకర్తకు మరియు ప్రతీ ఓటరు కు ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల్లో పనిచేసిన ప్రతి కార్యకర్తకి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత కార్యకర్తలకు అభిమానులకు నాయకులకు విలువ పెంచే విధంగా
కృషి చేస్తానని చెరుకువాడ శ్రీ రంగనాథ రాజు హామీ ఇచ్చారు.