రిజర్వ్డ్ ఈవీఎం వెహికల్ పై గందరగోళ పరిస్థితి.. వాస్తవ పరిస్థితిని వివరించిన జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్
భీమవరం మే 14: జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను వివరించి అనుమానాలను నివృత్తి చేయడం తో పరిస్థితి సద్దుమణిగింది.
ఈవీఎం వెహికల్ దారి మధ్యలో ఆగిందని, ఈ విషయమై ఒక వ్యక్తి వీడియో తీసి వ్యాప్తి చేయడంతో ఎస్ ఆర్ కె ఆర్ గేట్ వద్ద ఒక పార్టీ అభిమానులు ఆందోళనతో గుమిగూడగా కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ నుండి ఎన్నికల పోలింగ్ మోనిటర్ చేస్తున్న జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని తెలుసుకుని హుటాహుటిన ఎస్ ఆర్ కె ఆర్ కాలేజీ వద్దకు చేరుకుని ఆ వాహనం రిజర్వ్డు ఈవీఎంలకు సంబంధించిందని, ప్రతి పోలింగ్ స్టేషన్ కు రెండు, మూడు రిజర్వుడ్ ఈవెన్ లను పంపడం జరుగుతుందని, వాటిని తీసుకుని వచ్చే వెహికల్ మాత్రమేనని, పోలింగ్ కు వినియోగించిన ఈవీఎంలను తీసుకువచ్చే వెహికల్ కాదని స్పష్టం చేయడంతో గందరగోళ పరిస్థితి సద్దుమణిగింది.