మార్టేరు రెడ్డి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో హోరెత్తిన వైసిపి ప్రచారం
పెనుమంట్ర మే 10 :
పెనుమంట్ర మండలం మార్టేరు లో రెడ్డి సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో వైసీపీ ఎన్నికల ప్రచారం భారీగా హోరెత్తింది. గురువారం శివరావుపేట నుండి మార్టేరు, శెట్టి బలిజి రామాలయం, చిన్న పేట, తోక పేట, ఆటోనగర్, ప్రాంతాలలో సమన్వయ కమిటీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఆచంట వైసిపిఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాథరాజు, నరసాపురం ఎంపీ అభ్యర్థి గూడూరి ఉమాబాల కిఓటు వేయాలని రెండు ఓట్లు ఫ్యాను గుర్తుపై వేసి అఖండ మెజారిటీతో ఎమ్మెల్యే అభ్యర్థి,చెరుకువాడ శ్రీ రంగనాథ రాజును, ఎంపీ, అభ్యర్థి గూడూరి ఉమబాలను నెగ్గించాలని భారీగా ఎన్నికల ప్రచారం నిర్వహించారుతిరిగిన ప్రతి చోట ప్రజలు
అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వాలంటరీల కన్వీనర్ మార్టేరు వన్ ఎంపీటీసీ శ్రీమతికర్రీ అనురాధజోగిరెడ్డి మాట్లాడుతూ, ఆచంట నియోజకవర్గం లో చెరుకూడా శ్రీరంగనాథరాజుభారీ మెజారిటీతో నెగ్గుతున్నారని
అందుకు నిదర్శనం ప్రజలు పడుతున్న బ్రహ్మరథమని జగనన్నప్రతి పేదవానికి ఇంటింటికి ప్రవేశపెట్టిన పథకాలు కచ్చితంగా జగనన్న ముఖ్యమంత్రిగా నెగ్గిస్తున్నారని, ఆచంట నుండిరంగన్నను మరోసారి ఎమ్మెల్యేగాను ఎంపీ గాను ప్రజలు చూస్తున్నారని, ఎంపీగా ఉమాబాలను ప్రజలు ఆశీర్వదిస్తున్నారని. మరొకసారి వైసీపీ జెండా ఆంధ్ర రాష్ట్రంలో ఎగరవేస్తుందని ప్రజలు వైసిపి ఆదరాభిమానాల సునామీలో ప్రతిపక్షాలు కొట్టుకుపోతాయని ప్రజలు జగనన్నకు ఆచంటలో రంగన్నకు నరసాపురంలో ఉమాభాలకి పట్టం కడుతున్నారని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు చిర్ల సత్యనారాయణ రెడ్డి, ఎంపీటీసీ టు లక్ష్మారెడ్డి, బిసి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ గుత్తుల బోస్, తమనంపూడి వెంకటరెడ్డి ( టీవీ) రెడ్డి, మేడపాటి సూర్యనారాయణ రెడ్డి, కొవ్వూరు బ్రహ్మేశ్వర్ రెడ్డి, వెలగల నారాయణరెడ్డి, సత్తి సుబ్బారెడ్డి, తమనంపూడి ఈశ్వర్ రెడ్డి, మేడపాడు చిన్నబాబు, పులగం శ్రీను, పులగం కళ్యాణ్, 14 వ వార్డు మెంబర్ కప్పల అనంతలక్ష్మి,
అభిమానులు కార్యకర్తలు వివిధ హోదా కలిగిన నాయకులు పాల్గొన్నారు.