ఎన్నికలకు మరో 72 గంటలు సమయం ఉన్నందున. ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని,అధికారులు.జిల్లా కలెక్టరు సుమిత్ కుమార్..
భీమవరం మే 10 : గురువారం కలెక్టరేటు వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లాలోని అందరూ రిటర్నింగు అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, తహశీల్దార్లు, మున్సిపల్ కమీషనర్లు, యంపిడివోలకు గుగూల్ మీట్ ద్వారా పలు సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ఎఫ్ ఎస్ టి, ఎస్ ఎస్ టి, బృందాలు 24 గంటలు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. గ్రామాలలో నగదు, మద్యం, విలువైన బహుమతులు పంపిణీలు జరిగే అవకాశాలు ఉన్నందున తాహసిల్దార్లు ఎంపీడీవోలు, మున్సిపల్ కమీషనర్లు, వీఆర్వోలు, పంచాయతీ సెక్రెటరీలను అప్రమత్తం చేసి పంపిణీ జరగకుండా పూర్తి స్థాయిలో నిఘా ఉంచాలన్నారు. ఎన్నికల కమీషన్ నిబంధనల మేరకు అత్యంత బాధ్యతగా పనిచేయాలన్నారు. ఎప్పటికప్పుడు సమాచార లోపం లేకుండా సమన్వయంతో పనిచేయాలని జిల్లాలోని నియోజకవర్గ ఆర్వో లు, సంబంధిత అధికారులను జిల్లా కలెక్టరు, జిల్లా ఎన్నికల అధికారి సుమిత్ కుమార్ ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవిన్యూ అధికారి జె.ఉదయ భాస్కరరావు, ఎలక్షన్ సూపర్డెంటు సి.హెచ్. దుర్గా ప్రసాదు, కమాండ్ కంట్రోల్ రూమ్ అధికార్లు జెడ్. వెంకటేశ్వర రావు, యం.మోహన రావు, యు.మంగపతిరావు, ఆర్. విక్టర్, కె. జాషువా, తదితరులు పాల్గొన్నారు.