March 13, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్పాలిటిక్స్

వైసీపీ విన్నింగ్  టీం గూడెం రాజకీయాలలో సరికొత్త సంచలనం.

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తాడేపల్లిగూడెం,మే 9: తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం రాజకీయ చరిత్రలో ఇదొక సరికొత్త ముఖచిత్రం. నూతన అధ్యాయానికి నాంది ప్రస్తావన. సూపర్ హీరోలు అంతా కలిసి ఒకే సినిమాలో నటిస్తే ఎంత రక్తి కట్టిస్తుందో అదే రీతిన ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ రాజకీయ రంగంలో హేమహేమీల అపురూప కలయికతో వైఎస్ఆర్సిపి విజయం దిశగా ముందుకు దూసుకుపోతోంది. ఎవ్వరూ కలలో కూడా ఊహించి ఉండరు. ఎందుకంటే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రాజకీయ దిగ్గజాలుగా గుర్తింపు పొందిన వారంతా ఒక్కటయ్యారు. దీంతో కూటమి గుండెల్లో దడ పట్టుకుంది. ప్రస్తుతం రాజకీయ హేమా హేమీలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఒకప్పుడు వారు ఒకరిపై ఒకరు ప్రత్యర్థులుగా తల పడిన వారే. అయితే ఇప్పుడు ఆ హేమా హేమీలంతా ఒక్కటయ్యారు. కూటమికి ఓటమి రుచి చూపించేందుకు ఒక్కటై చేయి చేయి కలిపి ఎదురుగా నిలబడ్డారు. దీంతో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసిపి విజయం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన మరోసారి పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో తాడేపల్లిగూడెం నుంచి వైయస్సార్సీపి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈయన తరపున ఏపీ స్టేట్ ఆక్వా డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ వడ్డి రఘురాం నాయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఈలి నాని, పసల కనక సుందర రావులు పార్టీ విజయం కోసం నిబద్ధతతో కృషి చేస్తున్నారు. గత 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో కొనసాగుతూ ఏడోసారి పోటీ చేస్తున్న కొట్టు సత్యనారాయణ రెండు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఎంతో ప్రతిష్టాత్మకమైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అలాగే అప్సడ వైస్ చైర్మన్ గా ఉన్న వడ్డి రఘురాం నాయుడు సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. ఎందుకంటే అప్సడ చైర్మన్ గా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉంటే తన తర్వాత స్థానమైన వైస్ చైర్మన్ గా వడ్డి రఘురాంను పెట్టడమే సీఎం జగన్ తో ఆయనకున్న సన్నిహితత్వానికి ప్రత్యక్ష నిదర్శనం. ఈయన ప్రస్తుత ఎన్నికల్లో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కొట్టు సత్యనారాయణ ను ఎమ్మెల్యేగా గెలిపించేందుకు, అలాగే నరసాపురం ఎంపీగా గూడూరి ఉమాబాల విజయానికి కట్టుబడి పని చేస్తున్నారు. ప్రచారంలో అత్యంత చురుకుగా పాల్గొంటూ, పార్టీలో అంతర్గత సమన్వయం సాధించడానికి ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. అభ్యర్థి కొట్టుకు వెన్నంటే ఉంటున్నారు. ఇక మరో నాయకుడు ఈలి నాని విషయానికి వస్తే ఈయన విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు. తాడేపల్లిగూడెం రాజకీయాల్లో ఈలి కుటుంబానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈలి నాని ఒకసారి ఎమ్మెల్యేగా చేశారు. ఈయన తండ్రి స్వర్గీయ ఈలి ఆంజనేయులు మున్సిపల్ చైర్మన్ గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా పదవులు నిర్వహించారు. ఈయన తల్లి కూడా ఎమ్మెల్యేగా చేశారు. ఈయన అన్నయ్య మున్సిపల్ చైర్మన్ గా చేశారు. ఇలా తాడేపల్లిగూడెం రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం నుంచి రాజకీయ నేపథ్యం కలిగినది ఈలి కుటుంబం. అటువంటి నేపథ్యం నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ఇటీవల సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ప్రస్తుతం కొట్టు సత్యనారాయణ విజయానికి ఆయన అకుంఠిత దీక్షతో కృషి చేస్తున్నారు. ఇక పసల కనక సుందరరావు విషయానికొస్తే ఈయన రెండు సార్లు ఎమ్మెల్యేగా చేశారు. పెంటపాడు మండలం పడమర విప్పర్రు గ్రామానికి చెందిన పసల కనక సుందరరావుకు నియోజకవర్గ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ద్వారా సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కనక సుందరరావు ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు పశు గణాభివృద్ధి సంస్థ చైర్మన్ గా ఉన్నారు. ఇలా రెండుసార్లు ఎమ్మెల్యేగా, ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తూ మరోసారి బరిలోకి దిగిన సీనియర్ నాయకులు కొట్టు సత్యనారాయణ, ఆయనకు తోడుగా ప్రస్తుతం అప్సడ వైస్ చైర్మన్ గా ఉంటూ, చురుకైన నాయకుడిగా గుర్తింపు పొందిన వడ్డి రఘురాం నాయుడు, రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన పసల కనక సుందరరావు, సుదీర్ఘ రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చి ఒకసారి ఎమ్మెల్యేగా చేసిన ఈలి నాని ఇలా నలుగురు రాజకీయ దిగ్గజాలైన హేమా హేమీలు ఒకవైపు జట్టు కట్టడంతో వీరంతా వైసిపి విన్నింగ్ టీమ్ గా అందరూ భావిస్తున్నారు. వీరే కాకుండా పట్టణ రాజకీయాలలో సుదీర్ఘకాలంగా కొనసాగుతూ మున్సిపల్ కౌన్సిలర్లుగా, వైస్ చైర్మన్లుగా పదవులు నిర్వహించి ఆయా ప్రాంతాలలో మంచి పట్టు కలిగిన ఎగ్గిన నాగబాబు, కిలాడి ప్రసాద్, మారిశెట్టి సుబ్బారావు లాంటి ముఖ్య నాయకులు వైయస్సార్సీపీలో చేరడం శుభ పరిణామంగా భావిస్తున్నారు. అలాగే ఆర్యవైశ్య ప్రముఖులైన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గమిని సుబ్బారావు, చలంచర్ల మురళి, హరి, మహిళా నాయకురాలు మల్లిపూడి కనకదుర్గాదేవి వంటి నాయకులు వైఎస్సార్సీపీలో చేరి పార్టీ విజయం కోసం పని చేస్తున్నారు. మరోవైపు కూటమిలో చూస్తే ఇలాంటి గుర్తింపు పొందిన నాయకులు కానీ, రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వారు గానీ, ప్రజల్లో మంచి అభిప్రాయం కలిగిన వారు గాని లేకపోవడం కూటమి శ్రేణుల్లో గుబులు పుట్టిస్తోంది.

Related posts

పిఠాపురంఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

AR TELUGU NEWS

జగన్ కు చంద్రబాబు సర్కార్ షాక్

AR TELUGU NEWS

ఎన్నికల ఫలితాలకు ముందు చంద్రబాబు సంచలన నిర్ణయం… కారణం ఇదే!

AR TELUGU NEWS