కాకినాడ, మే 9 : వైసిపి అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దింపి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించే విజినరీ లీడర్ చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి అధికారాన్ని కట్టబట్టేందుకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎదురుచూస్తున్నారని
తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల కూటమి అధికారంలోకి వస్తేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని కాకినాడ సిటీ అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి అభ్యర్థి వనమాడి కొండబాబు పేర్కొన్నారు.
ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా స్థానిక 29 వ డివిజన్ నందు పర్యటించి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అందించే సూపర్ సిక్స్ సంక్షేమ పథకాల కరపత్రాలను పంపిణీ చేసి ఓటును అభ్యర్థించారు.
ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి గెలుపు చారిత్మాక అవసరం నెలకొoదని, యువత భవిష్యత్తు, నవ్యాంధ్ర పురోగతికి తెలుగుదేశం కూటమి అధికారంలోకి రావడం చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఆవశ్యమని తెలిపారు.
డివిజన్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన కూటమి అభ్యర్థి కొండబాబుకు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర అధ్యక్షుడు మండపాక సుబ్బు ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయిరాం వర్మ బాణసంచా కాల్చి, కొండబాబును పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు. కొండబాబు మండపాక సుబ్బును ఆత్మీయ ఆలింగనం చేసుకుని పార్లమెంట్ అసెంబ్లీ కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో పరిశీలికులు కేతా శ్రీనివాసరావు, డివిజన్ నాయకులు అమలకంటి బలరామ్, పినిశెట్టి శ్రీనివాసరావు, సిరియాల రాము చింతలపూడి రవి యాళ్ళ రామకృష్ణ అనసూరి మాధవరావు దూల్ల సూరిబాబు గుండా సూరిబాబు కరకవలస వీర నాగమణి గుల్లపూడి మంగ దుర్గ ఉదయభాను తమ్మన గంజి గోప ,మండపాక నాగబాబు ఫౌండేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

previous post