ఉండి మే 09: నరసాపురం పార్లమెంట్ అభ్యర్థి భూపతి రాజు శ్రీనివాస్ వర్మకు ఓటు వేసి గెలిపించాలంటూ ఉండి గ్రామంలో బిజెపి నాయకులు కొమ్మన నాగబాబు, బూరాడ సత్తిబాబు ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గడపగడపకు తిరుగుతూ అసెంబ్లీ టిడిపి కూటమి అభ్యర్థి రఘురామకృష్ణం రాజుకు సైకిల్ గుర్తుపై ఒక ఓటు నర్సాపురం పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ కు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని బ్యాలెట్ నమూనా చూపిస్తూ ఉండి గ్రామ ఓటర్లను అభ్యర్థించారు. బిజెపి నాయకులు నాగబాబు, సత్తిబాబు మాట్లాడుతూ దేశ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని నరేంద్ర మోడీ సారధ్యంలో మళ్లీ కేంద్రంలో అధికారం సాధించబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. నరసాపురం పార్లమెంటు అభ్యర్థి శ్రీనివాస్ వర్మను గెలిపించడం ద్వారా నియోజకవర్గాల్లో అభివృద్ధి సాధ్యమవుతుందని వర్మ కు ఓట్లు వేయడం వల్ల కేంద్రంలోని వచ్చే నిధులతో నియోజకవర్గాల్లో అభివృద్ధి జరుగుతుందని ప్రజల యొక్క సమస్యలన్నీ తీరుతాయని అన్నారు. 2024 ఎన్నికల్లో శ్రీనివాస్ వర్మను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ ప్రచారంలో జనసేన టిడిపి బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

next post