March 11, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

కీ.శే. గంధం సురేష్ స్మారక ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాల ప్రదానం!

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తాడేపల్లిగూడెం , మే 8 :

మీడియా సిబ్బంది బాధ్యతతో పనిచేసి సామాజిక గౌరవం పొందాలని ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ కోరారు.
గంధం సురేష్ స్మారక ఎలక్ట్రానిక్ మీడియా జిల్లాస్థాయి ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
తాడేపల్లిగూడెం జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్, ప్రెస్ క్లబ్ బుధవారం నిర్వహించిన పురస్కార ప్రదాన కార్యక్రమానికి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిసెట్టి రంగసురేష్ అధ్యక్షత వహించారు. రంగసురేష్ మాట్లాడుతూ సుమారు దశాబ్దకాలం పాటు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న గంధం సురేష్ చిన్నవయసులోనే కన్నుమూయడం బాధాకరమని అన్నారు. మంచి పరిశోధనాత్మక కథనాలు అందించడం ద్వారా పలు సమస్యలను వెలుగులోకి తెచ్చిన సురేష్ తోటి పాత్రికేయుల సంక్షేమానికి కూడా కృషి చేసారని గుర్తు చేశారు. గంధం సురేష్ స్మారకార్ధం ఆయన జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యుల తోడ్పాటుతో తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులకు పురస్కారాలను గత సంవత్సరం ప్రవేశపెట్టామని అన్నారు.
పురస్కారాలను ప్రతి ఏటా కొనసాగిస్తామని రంగ సురేష్ తెలిపారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్ మాట్లాడుతూ ప్రపంచంలో అత్యంత ప్రమాదకర వృత్తులలో మీడియా కూడా ఉందని , అయితే పాత్రికేయులు అందరూ ఇష్టపడే ఈ వృత్తిలోకి వచ్చారని , అందువల్ల కష్టాలను భరిస్తూనే ,సామాజిక బాధ్యతతో విధి నిర్వహణ చేయాల్సి ఉంటుందని అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఉత్తమ జర్నలిస్ట్ లకు పురస్కారాలు ఇచ్చే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనసాగించిందని , విభజన అనంతరం నిలిచిపోయిన అలాంటి ఉత్తమ సంప్రదాయాన్ని తిరిగి ప్రారంభించాలని సోమసుందర్ డిమాండ్ చేశారు.
జిల్లా స్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని ఎన్.టి.వి. స్టాఫ్ రిపోర్టర్ పి. మల్లికార్జున రావు కు, ఉత్తమ వీడియో జర్నలిస్ట్ పురస్కారాన్ని టివి 5 గౌస్ కు , తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని ఎ.బి.ఎన్ . విలేఖరి పాలడుగు సతీష్ కు ప్రదానం చేశారు.
తొలుత గంధం సురేష్ చిత్రపటానికి పాత్రికేయులు , కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రెస్ క్లబ్ కార్యదర్శి గొలిమే బుజ్జిబాబు స్వాగతం పలికారు.
కార్యక్రమంలో ఎ.పి.యు.డబ్ల్యు.జే. జిల్లా కార్యదర్శి గజపతి వరప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్.వి.లక్ష్మయ్య , సిటి కేబుల్ న్యూస్ ఎడిటర్ వై.ఎన్.వి. రమేష్ , సీనియర్ పాత్రికేయులు బూర్గుల భాను శ్రీనివాస్ , యద్దనపూడి సుబ్బారావు, మైలవరపు రవికిరణ్ , పెద్దోజు మురళీ , పాలచర్ల రవీంద్రనాథ్, ఆకుల రామ్ ప్రసాద్ , చింతకాయల దొరబాబు, సి.హెచ్. భాను ప్రకాష్ , తదితరులు మాట్లాడుతూ గంధం సురేష్ సేవలను గుర్తు చేశారు.
పురస్కార గ్రహీతలు మాట్లాడుతూ మీడియా రంగంలో తమ కృషిని గుర్తించి గంధం సురేష్ స్మారక ఉత్తమ జర్నలిస్ట్ పురస్కారాన్ని ప్రదానం చేసిన తాడేపల్లిగూడెం ప్రెస్ క్లబ్ కు , కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు.

Related posts

డబ్బు కాదు నమ్మకం నమ్మకం ముఖ్యమని తేల్చి చెప్పిన నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు

AR TELUGU NEWS

రేణిగుంట సబ్ రిజిస్టర్ శోభారాణి సస్పెండ్

AR TELUGU NEWS

పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పండగ వాతావరణంలో నిర్వహించాలి! జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

AR TELUGU NEWS