నర్సాపురం మే 08 : ఏపీ లో సంక్షేమ అభివృద్ధి కావాలి అంటే తిరిగి జగనన్న ప్రభుత్వమే రావాలి అని నర్సాపురం వైయస్సార్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజు అన్నారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ప్రసాదరాజు 95 శాతం పూర్తి చేసినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా ముదునూరి ప్రసాదరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పేద కుటుంబాలకు అతి చేరువలో సంక్షేమ పథకాలను అమలు చేసి ప్రతి గుండెల్లో చిరస్థాయిగా స్థానాన్ని ఆక్రమించుకున్నారని స్పష్టంగా కనిపిస్తోంది అని అన్నారు. ప్రాథమిక విద్య కోసం అమ్మ ఓడి, ఉన్నత విద్యా కోసం విద్యాదీవెన, వసతి దీవెన వంటి, మహిళలకు చేయూత, ఆసరా, రుణమాఫీ వంటి కార్యక్రమాలు చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే. సంక్షేమ పథకాలు యాధావిధిగా కొనసాగాలంటే తిరిగి జగన్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పీఠం ఎక్కితేనే సాధ్యం అని ప్రసాదరాజు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో ఒక్కడిగా ఒంటి చేత్తో వైయస్సార్ పార్టీ మోస్తున్నా వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రతీ అక్క, చెల్లి, అవ్వ,తాత మరియు సోదరులు అంతా కలిసి జగనన్న కోసం ఆలోచించి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీ తో నెగ్గించాలని లబ్ధిపొందిన కుటుంబాలను కోరారు.
