ఆచంట మే 08 :
ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం చేసుకో వాలని ఆచంట వైఎస్సార్ సీపీ అభ్యర్ధి చెరుకువాడ శ్రీ రంగనాధ రాజు కోరారు. పోడూరు మండలం కవిటం గ్రామానికి చెందిన తూర్పు కాపు సామాజిక వర్గం మహిళలు,యువతతో పాటు 200 కుటుంబాలు ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీ రంగనాధ రాజుకు మద్దతు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సంక్షేమం,అభివృద్ధి కేవలం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలోనే సాధ్యమన్నారు. 30కి పైగా సంక్షేమ పథకాలు అమలు చేయడమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టి కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు వస్తే రాష్ట్రాన్ని దోచుకోవడం చేయడమే కాకుండా రాష్ట్రం 30ఏళ్లు వెనక్కు వెళ్తుందన్నారు. 14ఏళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనకు గుర్తుగా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదన్నారు. ఉన్న పథకాలను నిర్వీర్యం చేయడం. తనవర్గం వారికి దోచి పెట్టడమే చంద్రబాబు పాలన సాగు తుందన్నారు. గతంలో రైతులకు, ద్వాడ్రా మహిళలకు రుణమాఫీ అని చెప్పి చేయకుండా నిలువునా మోసం చేశారన్నారు. ఇప్పుడు అమలు సాధ్యం కాని హామీలతో ప్రజలను మోసం చేయడానికి వస్తున్నాడన్నారు. చంద్రబాబు చెప్పేవి సూపర్సిక్స్ కాదని, ఆరు మోసాలని వాటిని ప్రజలు నమ్మడం లేదన్నారు. చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే రూ.2లక్షల కోట్లు అవసరమని, కాబట్టి ఒక్క హామీ కూడా అమలు చేయరన్నారు. వచ్చే ఎన్నికల్లో ఫ్యాను గుర్తుపై ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.