- ల్యాండు సాండ్ అంతా మాఫియా
రాష్ట్రంలో ల్యాండ్ సాండ్ వైను మైను అన్నింటా జగన్ మాఫియా నడుస్తోందని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గం లోని పెంటపాడు మండలం జట్లపాలెం, ఉమామహేశ్వరం,వెస్ట్ విప్పర్రు గ్రామాల్లో మంగళవారం బొలిశెట్టి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేయగా నియోజవర్గంలో కొట్టు మరింత అవినీతికి పాల్పడ్డాడని విమర్శించారు. వైసీపీ అభ్యర్థి కొట్టు సత్యనారాయణ పేరు చెబితే చిరు వ్యాపారుల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారుల వరకు భయపడే స్థాయిలో కొట్టు దందా సాగిందన్నారు. అయినా అవినీతి పై మాట్లాడకుండా రౌడీలు ఏంటో దుష్ప్రచారం చేస్తున్నారని ధైర్యం ఉంటే తన సవాళ్లు స్వీకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ఈతకోట తాతాజీ, మండల అధ్యక్షులు పుల్ల బాబి,కిలపతి వెంకటరావు, దత్తు ప్రసాద్ తెలుగుదేశం బిజెపి నాయకులు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
