తాడేపల్లిగూడెం, తాడేపల్లిగూడెం, ఉమర్ అలీషా కేంద్రం లో జరిగిన పత్రికా సమావేశంలో యోగా గురువు కరిబండి రామకృష్ణను సత్కరించిన శిష్యులు. యోగసాన్ భారత్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 29 నుండి మే 3 వరకు పంజాబ్ లోని పాటియాలలో నేషనల్ యోగాసన జడ్జ్ ప్రోగ్రామ్ లెవల్ 1,2,2+ విభాగంలో జరిగాయి. ఈ శిక్షణా కార్యక్రమం లో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల నుండి 180 మందికి పైగా “యోగాసన న్యాయమూర్తులు” శిక్షణ పొందారు. ఈ కార్యక్రమంలో ఆంద్రప్రదేశ్ నుండి వై ఎస్ ఏ ఏ పి ( యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి ) 8 మందికి మాత్రమే అవకాశం దొరకగా అందులో మన పశ్చిమగోదావరి జిల్లా నుండి కరిబండి రామకృష్ణ కి ఒకరికి మాత్రమే అవకాశం దక్కింది. శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన సందర్భం గా యోగా కోచ్ కరిబండి రామకృష్ణ మాట్లాడుతూ యోగాసనాన్ని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక స్పోర్ట్ గా పరిగణిచింది. దీనిని “కేలో ఇండియా” లోను అలానే త్వరలో ఏషియన్ గేమ్స్ మరియు ఒలంపిక్ లో చేర్చాడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. విద్యార్థినీ విద్యార్థులు యోగాసన క్రీడలును నేర్చుకోని పతకాలు సాధించి స్పోర్ట్స్ కోటాలో మంచి ఉద్యోగ అవకాశాలు పొందాలని సూచించారు. దానికి కావాల్సిన శిక్షణను తాను ఉచితంగా ఇస్తానని చెప్పారు. అసక్తి ఉన్నవారు ఈ నెంబర్ కి 9440528855 కాల్ చేయాలన్నారు. ఈ సందర్భంగా తాడేపల్లిగూడెం ఆరా ఫౌండేషన్ యోగ సాధకులు అపర్ణ ప్రసాద్, త్రిమూర్తులు, నాగేశ్వరరావు, సుజాత ప్రసన్న మరియూ యోగ సభ్యులు అభినందించారు.

previous post