తాడేపల్లిగూడెం,మే 6: తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో ఊరు-వాడ కొట్టుకు జేజేలు పలుకుతోంది. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఎన్నికల ప్రచారానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. యువత కేరింతలు కొడుతూ మోటార్ సైకిల్ పై జెండాల రెపరెపలతో ర్యాలీగా ఉరకలేస్తున్నారు. మహిళలు ఎక్కడికక్కడ ముందుకు వచ్చి అభ్యర్థి కొట్టుకు హారతులు ఇచ్చి, విజయ తిలకం తో ఘన స్వాగతం పలుకుతున్నారు. అనేక మంది ముందుకు వచ్చి మంత్రి కొట్టును పూలమాలలు,శాలువాలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇలా ప్రచారంలో ఎక్కడికి వెళ్ళినా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టుకు ఊరువాడ జేజేలు పలుకుతూ బ్రహ్మ రథం పడుతోంది. టిడిపి, జనసేన పార్టీలకు చెందిన పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తటస్థంగా ఉండే పెద్దలు సైతం కొట్టుకు మద్దతు పలుకుతున్నారు. ఈ ఎన్నికల్లో ఆయనను గెలిపిస్తామంటూ మాట ఇస్తున్నారు. తాడేపల్లిగూడెం పట్టణంలో పలు వార్డుల్లో సోమవారం జరిగిన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఎన్నికల ప్రచారం పై రీతిన సాగింది. పట్టణంలోని 7,10,12,11,13,16,15,14,17,19,20 వార్డుల్లో మంత్రి కొట్టు సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా పి అండ్ టి కాలనీలోని స్కేటింగ్ పార్కు వద్ద జనసేన కు చెందిన మహిళ నాయకురాలు భారీగా మహిళలతో ఊరేగింపుగా వచ్చి మంత్రి కొట్టు సత్యనారాయణ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈమెకు పార్టీ కండువా వేసి మంత్రి కొట్టు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి ఏడవ వార్డు రాకెట్ పార్కు వద్దకు చేరుకున్నారు. అక్కడ పట్టింపాలెం గ్రామానికి చెందిన జనసేన నాయకుడు బంగారు రాజు నాయుడు మంత్రి కొట్టు సమక్షంలో వైసీపీలో చేరారు. ఆయనకు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఆ ప్రాంతానికి చెందిన ప్రముఖులు మేడపాటి సత్యనారాయణ రెడ్డి వైసీపీలో చేరారు. ఈయనకు కూడా కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం 10 వ వార్డు పాతూరు లోని చిన్న బలుసులమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. అక్కడ మహిళలు, యువకులు మంత్రి కొట్టుకు ఘన స్వాగతం పలికారు. ఇక్కడ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. అనంతరం ప్రచార రథంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. పాతూరు లోని ప్రముఖ వ్యక్తి అయిన రైతు నాయకులు కర్రి సీతారామయ్య ఇంటికి చేరుకున్నారు. సీతారామయ్య మంత్రి కొట్టుకు ఘన స్వాగతం పలికారు. అక్కడ మంత్రి కొట్టు తో పాటు మాజీ ఎమ్మెల్యే ఈలి నాని, పాతూరు ప్రముఖులు రావుల శంకరం, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కర్రి భాస్కరరావు, శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ ప్రత్యేక ఆహ్వానితులు కొట్టు నాగేంద్ర తదితర ప్రముఖులు కొద్దిసేపు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా పెద్దలు కర్రి సీతారామయ్య మంత్రి కొట్టు విజయానికి పూర్తిగా సహకరిస్తారని మంత్రి కొట్టు, సీతారామయ్యల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే ఈలి నాని ప్రకటించారు. అనంతరం అక్కడ నుంచి 12 వ వార్డు వినాయకుడి గుడి సెంటర్ కు చేరుకుని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తదనంతరం 11వ వార్డు సత్యవతి నగర్ బోర్డు వద్దకు చేరుకుని అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులోనూ కొట్టు ప్రచారానికి ప్రజలు ఎదురొచ్చి స్వాగతం పలికారు. తీన్మార్ డప్పులు, డిజె సౌండ్ లు, అభ్యర్థి కొట్టుపై రూపొందించిన పాటలతో ఎన్నికల ప్రచారం హోరెత్తింది. ఆద్యంతం జోరుగా హుషారుగా సాగింది. వైయస్సార్సీపి అభ్యర్థి కొట్టు సత్యనారాయణ ఎన్నికల ప్రచార హోరు వైసీపీ జోరును తలపించింది. ఈ ప్రచార కార్యక్రమంలో ఆయా వార్డులు ఇన్చార్జిలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువకులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

previous post