ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ అధికారం ఇస్తే, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు జగన్.ఏపీ సీఎం జగన్ ఇవాళ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరుధిలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం. ఇప్పటికే కూటమి నేతలపై విరుచుకుపడుతూ వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యమంత్రి. టంగుటూరులోనూ విపక్షాలపై మాటల దాడికి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి పేరుతో చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ఆ మోసాలను ప్రజలు మరిచిపోవద్దని చెబుతున్నారు జగన్.ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్రెడ్డితో పాటు కొండపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటి చేస్తున్న ఆదిమూలపు సురేష్ గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు జగన్. టంగుటూరు లో పర్యటన తర్వాత
మధ్యాహ్నం 12.30కి కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు సీఎం జగన్. మైదుకూరు 4 రోడ్ల జంక్షన్ లో జరిగే సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి.కడప నుంచి ఎంపీ అభ్యర్ధిగా అవినాష్ రెడ్డి, మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి రఘురామిరెడ్డి పోటి చేస్తున్నారు.కడప పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రచారం తర్వాత మధ్యాహ్నం రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటిస్తారు సీఎం జగన్. మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు
నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సీఎం జగన్. కాగా, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా
మిథున్ రెడ్డి, పీలేరు అభ్యర్థిగా చింతల రాంచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. చంద్రబాబుతో
పాటు కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో
మండిపడుతూ, మండే ఎండలో తన ప్రచారాన్ని
కొనసాగిస్తున్నారు సీఎం జగన్.

previous post
next post