March 9, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

తిరుమల: రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 2023-24 ఏడాదికి గాను రూ.1,161కోట్లు, 1,031 ​కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్‌ చేసింది.కాగా, గత ఐదేళ్లలో రికార్డు స్థాయిలో టీటీడీ ఆదాయం గణనీయంగా పెరిగింది.ఇక, తాజాగా రూ.1,161కోట్లు, 1,031 ​కేజీల బంగారాన్ని టీటీడీ డిపాజిట్‌ చేయడంతో మొత్తంగా రూ.18వేల కోట్లకు డిపాజిట్లు చేరుకున్నాయి. దీంతో, ప్రస్తుతం ఏటా లభించే వడ్డీ 1,200 కోట్ల దాటింది. కాగా, 2018 నాటికి ఏటా లభించే వడ్డీ రూ.750 కోట్లుగా ఉంది. ఈ క్రమంలో ఐదేళ్ల కాలంలో వడ్డీ దాదాపుగా 500 కోట్లు ఎక్కువకు చేరుకుంది.

  1. మరోవైపు.. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. దీంతో, శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. తిరుమలలో ఉచిత దర్శనం కోసం భక్తులు 31 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. ఇక, నిన్న(శనివారం)73,051 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న ఒక్కరోజు 34,599 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శనివారం తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.92కోట్లుగా ఉంది.

Related posts

రైతులకు గోనె సంచులు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీవోకు వినతి

AR TELUGU NEWS

ఏలూరు లో సజావుగా రెండోరోజు పోస్టల్ బ్యాలెట్ పోలింగ్

AR TELUGU NEWS

తల్లికి వందనం ఒక బిడ్డకేనా – తేల్చి చెప్పిన నారా లోకేష్…!!

AR TELUGU NEWS