- వైయస్సార్సీపీలో చేరిన పుప్పాల శివాజీ *తాడేపల్లిగూడెం,ఏప్రిల్ 19:
- పట్టణంలోని పాతూరు ప్రాంతానికి చెందిన అత్యంత చురుకైన క్రియాశీలక కార్యకర్త పుప్పాల శివాజీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం సాయంత్రం ఈలి నాని నివాసంలో పుప్పాల శివాజీకి మంత్రి కొట్టు కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ ఎమ్మెల్యే ఈలి నాని సమక్షంలో కొట్టు చేతుల మీదుగా పుప్పాల శివాజీ వైఎస్ఆర్సిపి కండువా వేసుకున్నారు. శివాజీ పాతూరు ప్రాంతంలో ఈలి నానికి ప్రధాన అనుచరుడిగా గుర్తింపు పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను ఎప్పుడు ఈలి నాని వెంటే ఉన్నానని, ఆయన అడుగుజాడల్లోనే తాను నడుచుకుంటానన్నారు. కొట్టు సత్యనారాయణ విజయానికి కృషి చేస్తానని ఈ సందర్భంగా పుప్పాల శివాజీ తెలియజేశారు.