పెంటపాడు మండలం కస్పా పెంటపాడు గ్రామంలో వేంచేసియున్న శ్రీ వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామి వార్లను (బైరాగి మఠం) శుక్రవారం తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వార్లకు ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఆలయం నుంచి కూటమి పార్టీ శ్రేణులతో భారీ ర్యాలీగా తాడేపల్లిగూడెం బయలుదేరి వెళ్లారు. టీడీపీ -బీజేపీ – జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.