ఈ గ్యారెంటీ ల వల్ల ప్రతి కుటుంబానికి ఖచ్చితంగా మేలు జరగనుంది. చెప్పింది చెప్పినట్టు అమలు చేస్తున్న కాంగ్రెస్ సర్కారు విపక్షాలపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది. కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ అయోధ్యలో రామ మందిరం కట్టించారు సరే 400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర 1100 కు ఎందుకు పెంచారు, అని ప్రజలను నిలదీయమని చెబుతున్నారు. ఇక టిఆర్ఎస్ పార్టీ పై కృంగిపోయిన మేడిగడ్డ ప్రాజెక్టుతో సహా అప్పటి వైఫల్యాలను ప్రజల ముందు ఎండగట్టే ప్రయత్నం చేస్తుంది. రైతుబంధు తో సహా పలు స్కీముల పేరుతో అర్హులైన పేదలకే కాకుండా వేలకోట్ల రూపాయల ప్రజాధనాన్ని భూస్వాములకు అనర్హులకు కట్టబెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
మొత్తం మీద మళ్లీ పార్లమెంటు ఎన్నికల ముందు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీ ల మాట సర్వత్రా వినిపిస్తోంది. ఈ గ్యారెంటీలకు కచ్చితంగా ప్రజలు ఆకర్షితులయ్యారని అంశం మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు రుజువు చేశాయని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ నూరు శాతం ఫలితాలు సాధిస్తుందని ఆ పార్టీ నేతలు ధీమాగా చెబుతున్నారు.